Sunday, May 8, 2011

బారు,బీరు,బోరు,జోరు అనే పదాలతో దత్తపది

బారుకు హిందీలోనెక

బీరు కవితలల్లి గొప్ప పేరును పొందెన్

బోరుగొలుపవీ కవితలు

జోరుగ నీతులు నుడివెనుసుందరశైలిన్

Friday, November 5, 2010

సైడెఫెక్టు

తే.గీ.
బిళ్ళలకు నలువైపులంచులను కత్తి
రించి మింగెదవా? పోకిరి వెధవయని
తల్లి యడుగగా? నీకేమి తెలుసు' సైడె
ఫెక్టు' రాకుండు ననె కొంటెబాలుడంత.

సిగ్గనేలు

తే.గీ.
ఔర! హుస్సేను సాగరు నందు గల
బుద్ధ విగ్రహమొకచేయి కిందికొక
చేయి పైకి చూపుట యెందుకనగ
క్రింద నున్న నీరు ద్రావిన పైకి పోదురని చెపుటె.

Thursday, October 14, 2010

దోమ-చీమ ( ప్రేమ వివాహం)









దోమ ప్రేమించి పెండ్లాడె చీమను , గది
లోపల పరుండె చీమ, దోమ బయటుండె
మొదటి రేయి ఎందుకనగా మోసపోయె
దోమ ఆలౌట్ను వెలిగించె దొంగముండ



Saturday, April 3, 2010

వాచ్, విగ్గు, చైను, టై తో దత్తపది

ఉ.
కళ్ళకు జోడు ఫాషనుకు కాలముదెల్పగరిష్టువాచ్ యు,హా!
చెల్లని తెల్ల జుట్టు ధర చెల్లగ నల్లని విగ్గు తో మెడన్
కళ్ళెమువోలెచైనులును కాళ్ళకు చెప్పులునెత్తుపెంచగా
సెల్లుయు టై బిగించి చను శీఘ్రమెమానవుడగ్రగామియై.

Monday, January 4, 2010

గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా

కం.

తిరిగెనెవడమృతమునకు? ఎ
వరికి చవితినాడు పూజ వరముగ జరుగున్?
భరతుడురామునకేమగు?
గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా

Wednesday, December 30, 2009

గారెలు,బూరెలు,సారెలు,చీరెలు

కం.
గారెలుయన్నాయన, మరి
బూరెలు సంక్రాంతినాడు బుట్టెడు యరిసెల్
సారెలు బోలెడు యిస్తిని
చీరెలు, నాకన్న మిన్న చెల్లికి పతియున్.