Friday, November 5, 2010

సైడెఫెక్టు

తే.గీ.
బిళ్ళలకు నలువైపులంచులను కత్తి
రించి మింగెదవా? పోకిరి వెధవయని
తల్లి యడుగగా? నీకేమి తెలుసు' సైడె
ఫెక్టు' రాకుండు ననె కొంటెబాలుడంత.

సిగ్గనేలు

తే.గీ.
ఔర! హుస్సేను సాగరు నందు గల
బుద్ధ విగ్రహమొకచేయి కిందికొక
చేయి పైకి చూపుట యెందుకనగ
క్రింద నున్న నీరు ద్రావిన పైకి పోదురని చెపుటె.

Thursday, October 14, 2010

దోమ-చీమ ( ప్రేమ వివాహం)









దోమ ప్రేమించి పెండ్లాడె చీమను , గది
లోపల పరుండె చీమ, దోమ బయటుండె
మొదటి రేయి ఎందుకనగా మోసపోయె
దోమ ఆలౌట్ను వెలిగించె దొంగముండ



Saturday, April 3, 2010

వాచ్, విగ్గు, చైను, టై తో దత్తపది

ఉ.
కళ్ళకు జోడు ఫాషనుకు కాలముదెల్పగరిష్టువాచ్ యు,హా!
చెల్లని తెల్ల జుట్టు ధర చెల్లగ నల్లని విగ్గు తో మెడన్
కళ్ళెమువోలెచైనులును కాళ్ళకు చెప్పులునెత్తుపెంచగా
సెల్లుయు టై బిగించి చను శీఘ్రమెమానవుడగ్రగామియై.

Monday, January 4, 2010

గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా

కం.

తిరిగెనెవడమృతమునకు? ఎ
వరికి చవితినాడు పూజ వరముగ జరుగున్?
భరతుడురామునకేమగు?
గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా