Friday, January 16, 2009

స్స

దేశము యశస్సు నోజస్సు లెస్సగుండ

బాలల వయస్సు నాయుస్సు తగ్గకుండ

చదువ మేధస్సు తేజస్సు చక్కగుండ

జరిపెడి తపస్సున మనస్సు జారకుండ

నిండిన సరస్సు వర్ఛస్సు వీడకుండ

అవని నిస్సారముస్సూరుమనకయుండ

అగ్నికి ఉషస్సు నెహవిస్సుహారతిచ్చి

ఉత్సవము చేసిరుత్సాహమొప్పధరణి.

Thursday, January 8, 2009

ర్ష

హర్షా! వర్షముపడిపలు

వర్షములర్హము రక్షణయని రాజర్షుల్

ఘర్షణపడగా క్షణములో

కర్షక హర్షము నకు నొక వర్షము కురిసెన్  

Monday, January 5, 2009

శ్శ

ఆదర్శమే విమర్శలు
సుదర్శన! నిదర్శనమిది దుశ్శీలముకున్
యాదుశ్శాసను నిశ్శం
కదునుమ నిశ్శేషమగు మనశ్శాంతియగున్

Sunday, January 4, 2009

వ్వ

నవ్వుతు దువ్వెనతో తల

దువ్వెదవూ రవ్వలడ్డు బూందీ గవ్వల్ 

బువ్వలు పెట్టెడి నవ్వుల

పువ్వువు వెలుగివ్వు దివ్వె నువ్వేనవ్వా.

Saturday, January 3, 2009

ల్ల

మల్లికొకబుల్లిచెల్లీ
ఇల్లిల్లూతిరిగి చల్లతెచ్చీ మళ్ళీ
అల్లరిలేకెల్లుబడికి
తల్లికిచెల్లనదు పేరట కనకవల్లీ

Friday, January 2, 2009

ర్ర

గొర్రెల కుర్రాడెర్రని
కిర్రను చెప్పులును చర్రుచిర్రనువెర్రిన్
కర్రను నెర్రనివీగని
గుర్రము గుర్రనుచు దడిసి బుర్రునబారెన్

Thursday, January 1, 2009

య్య

గొయ్యిని తియ్యకు, నుయ్యిని

ముయ్యకు, దయ్యము కలదని కుయ్యకుమయ్యా!

అయ్యనుయమ్మను నొయ్యకు

సెయ్యకు కయ్యము, గురువుతొసైయ్యనకెపుడున్.