Showing posts with label అనుప్రాసగేయాలు. Show all posts
Showing posts with label అనుప్రాసగేయాలు. Show all posts

Wednesday, January 21, 2009

ళ్ళ

బళ్ళోకెళ్ళరువీళ్ళు
పెళ్ళికివెళ్ళుటమరువరువీళ్ళూళ్ళెళ్ళీ 
పెళ్ళిళ్ళవిందు చళ్ళా
పిళ్ళారాయుళ్ళు విందుకెళ్ళుమళ్ళీ

గుళ్ళో పందిళ్ళళ్ళిరి
ఊళ్ళో ఇళ్ళకు తలుపుకు గొళ్ళెముపెట్టే
వెళ్ళిరి వీళ్ళూవాళ్ళూ 
పెళ్ళిలో భోజనము చేసె పెళ్ళోళ్ళెళ్ళెన్


Friday, January 16, 2009

స్స

దేశము యశస్సు నోజస్సు లెస్సగుండ

బాలల వయస్సు నాయుస్సు తగ్గకుండ

చదువ మేధస్సు తేజస్సు చక్కగుండ

జరిపెడి తపస్సున మనస్సు జారకుండ

నిండిన సరస్సు వర్ఛస్సు వీడకుండ

అవని నిస్సారముస్సూరుమనకయుండ

అగ్నికి ఉషస్సు నెహవిస్సుహారతిచ్చి

ఉత్సవము చేసిరుత్సాహమొప్పధరణి.

Monday, January 5, 2009

శ్శ

ఆదర్శమే విమర్శలు
సుదర్శన! నిదర్శనమిది దుశ్శీలముకున్
యాదుశ్శాసను నిశ్శం
కదునుమ నిశ్శేషమగు మనశ్శాంతియగున్

Sunday, January 4, 2009

వ్వ

నవ్వుతు దువ్వెనతో తల

దువ్వెదవూ రవ్వలడ్డు బూందీ గవ్వల్ 

బువ్వలు పెట్టెడి నవ్వుల

పువ్వువు వెలుగివ్వు దివ్వె నువ్వేనవ్వా.

Saturday, January 3, 2009

ల్ల

మల్లికొకబుల్లిచెల్లీ
ఇల్లిల్లూతిరిగి చల్లతెచ్చీ మళ్ళీ
అల్లరిలేకెల్లుబడికి
తల్లికిచెల్లనదు పేరట కనకవల్లీ

Friday, January 2, 2009

ర్ర

గొర్రెల కుర్రాడెర్రని
కిర్రను చెప్పులును చర్రుచిర్రనువెర్రిన్
కర్రను నెర్రనివీగని
గుర్రము గుర్రనుచు దడిసి బుర్రునబారెన్

Thursday, January 1, 2009

య్య

గొయ్యిని తియ్యకు, నుయ్యిని

ముయ్యకు, దయ్యము కలదని కుయ్యకుమయ్యా!

అయ్యనుయమ్మను నొయ్యకు

సెయ్యకు కయ్యము, గురువుతొసైయ్యనకెపుడున్.

Tuesday, December 30, 2008

మ్మ

అమ్మేమో మమ్ము రమ్మనె

బొమ్మల ముమ్మరము చూడ బొంబాయికినీ

వమ్మనకు , పొమ్మనమ్మా!

అమ్ముమ్మిమ్మన్న సొమ్ముమాకిమ్మమ్మా.

Monday, December 29, 2008

బ్బ

డబ్బుల డబ్బా దొబ్బిరి

సబ్బును రిబ్బను కొనవలెనబ్బా! దుబ్బున్

యుబ్బిన అల్లం రెబ్బకు

సుబ్బులు దబ్బున నిరువది రూకలు యిచ్చెన్.

Saturday, December 20, 2008

ప్ప

అప్పులుసెయ్యకుమెప్పుడు

మెప్పునులేదుతెగతీర్పతిప్పలునొప్పున్

గొప్పగనొప్పరునెక్కడ

చెప్పకుమిదియప్పనితగదెప్పుడుతప్పున్

Thursday, December 18, 2008

న్న

తిన్నడు కన్నును పీకన్
కన్నులు మూడున్నవైన కాదన్నావా?
ఎన్నున్నా? నీకన్నా
కన్నడి మనసెన్న వెన్నకన్నా మిన్నే!

Monday, December 15, 2008

ద్ద

ముద్దుగ పెద్దలు వద్దన

కద్దని విద్దెను విడిచితి హద్దులు మీరిన్

మొద్దువి ఈ రెండెద్దులు 

వొద్దుర నీకివి చదువుము యుద్ధతిపొందన్

Sunday, December 14, 2008

త్త

అత్తా అత్తరు సీసా
ఉత్తది ధనమిత్తువటనె కొత్తది తెత్తున్
చెత్తకు వేయర సత్తిగ 
ఉత్తుత్తీ సుత్తి మాని కొత్తది ఉందీ.

Friday, December 12, 2008

ణ్ణ

కర్ణమున పుట్టి కర్ణుడు 
పర్ణముపైపెట్టెలో జనార్ణవ మేగెన్
కర్ణుని వర్ణన తరమే
వర్ణవివర్ణము సవర్ణవర్ణన చేయన్

Thursday, December 11, 2008

డ్డ

యెడ్డెము తెడ్డెము జిడ్డున్
దొడ్డది యడ్డమగు పాము నొడ్డగగడ్డై 
వొడ్డాణమొడ్డె కాకియు
యడ్డమగు పుట్టలొ, పాము నడ్డియువిరిగెన్

Wednesday, December 3, 2008

ట్ట

అట్టిట్ట చూచి గుట్టుగ
పెట్టె పగులగొట్టి పట్టు చీరెలు తీయన్
చిట్టి కనిపెట్టి దొంగను 
తిట్టెను మొట్టెను చివరకు నెట్టెను కొట్టెను

Sunday, November 30, 2008

జ్జ

బుజ్జాయి బుజ్జి బొజ్జకు
అజ్జీర్ణ మొలదెని కజ్జికాయలు గుజ్జుల్
మజ్జిగగుడిపెనుబెజ్జమ
ముజ్జగముల బుజ్జియనుచు ముద్దుగ బుజ్జీ


బుజ్జికి గజ్జెలు గారెకు
బెజ్జము బొజ్జయు గణపతికెంతో అందం
మజ్జయు ఎముకకు కన్యకు
లజ్జయు ఒజ్జలు బడికిని కావలెబుజ్జీ

Saturday, November 29, 2008

చ్చ

మచ్చలయావది ! పచ్చని

పచ్చిక కుచ్చువిడమెచ్చి పలుపాలిచ్చున్

మచ్చలదది! పనికొచ్చా?

మ్రుచ్చుది, పిచ్చిదని తన్న  నొచ్చును చచ్చున్.

Friday, November 28, 2008

గ్గ

ధిగ్గున ముగ్గురు జగ్గులు

మగ్గులు పెగ్గులు కొనిరట భగ్గున మండన్

బిగ్గర గరచి మొగ్గిరి

సిగ్గులు ఎగ్గులు విడచిరి నెగ్గిరి తగవున్

Thursday, November 27, 2008

క్క

రెక్కలు ముక్కలు సలిపీ
లిక్కితొ చక్కగ బొరుసులు చెక్కి తినక్కా!
పిక్కలు, చెక్కిలి నొక్కులు
ముక్కును ముఖమునిటుచూడుమొక్కటి గొనుమా!