Thursday, October 14, 2010

దోమ-చీమ ( ప్రేమ వివాహం)









దోమ ప్రేమించి పెండ్లాడె చీమను , గది
లోపల పరుండె చీమ, దోమ బయటుండె
మొదటి రేయి ఎందుకనగా మోసపోయె
దోమ ఆలౌట్ను వెలిగించె దొంగముండ



Saturday, April 3, 2010

వాచ్, విగ్గు, చైను, టై తో దత్తపది

ఉ.
కళ్ళకు జోడు ఫాషనుకు కాలముదెల్పగరిష్టువాచ్ యు,హా!
చెల్లని తెల్ల జుట్టు ధర చెల్లగ నల్లని విగ్గు తో మెడన్
కళ్ళెమువోలెచైనులును కాళ్ళకు చెప్పులునెత్తుపెంచగా
సెల్లుయు టై బిగించి చను శీఘ్రమెమానవుడగ్రగామియై.

Monday, January 4, 2010

గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా

కం.

తిరిగెనెవడమృతమునకు? ఎ
వరికి చవితినాడు పూజ వరముగ జరుగున్?
భరతుడురామునకేమగు?
గరుడుడు గణపతి కనుజుడుగావలెనహహా

Wednesday, December 30, 2009

గారెలు,బూరెలు,సారెలు,చీరెలు

కం.
గారెలుయన్నాయన, మరి
బూరెలు సంక్రాంతినాడు బుట్టెడు యరిసెల్
సారెలు బోలెడు యిస్తిని
చీరెలు, నాకన్న మిన్న చెల్లికి పతియున్.

Monday, December 28, 2009

కాకిని గని రావణుండు కౌగిలి కోరెన్

కం.
నాకోరిక తీర్చుమనుచు
యాకామకళాప్రవీణయానందముతో
యాకులసతిసీతను యే
కాకిని గని రావణుండు కౌగిలి కోరెన్

Sunday, December 27, 2009

బారు, బీరు, బోరు, జోరు

కం. బారుకు హిందీలోనె, క
బీరుకవితలల్లి గొప్పపేరున్ పోందెన్
బోరుగొలుపవీరచనలు
జోరుగ నీతులు నుడివెను సుందరశైలిన్

Saturday, November 28, 2009

మొత్తం కాళ్ళెన్ని?

కం.
బల్లికి నాలుగు కాళ్ళున్
పిల్లికివలెనే, ఎనిమిది పిల్లుల కొకటే
తల్లి, మరి బల్లి తల్లికి
చెల్లికి కలిపెన్నికాళ్ళు చెప్పవె బాలా!