గారెలుయన్నాయన, మరి
బూరెలు సంక్రాంతినాడు బుట్టెడు యరిసెల్
సారెలు బోలెడు యిస్తిని
చీరెలు, నాకన్న మిన్న చెల్లికి పతియున్.
దేశము యశస్సు నోజస్సు లెస్సగుండ
బాలల వయస్సు నాయుస్సు తగ్గకుండ
చదువ మేధస్సు తేజస్సు చక్కగుండ
జరిపెడి తపస్సున మనస్సు జారకుండ
నిండిన సరస్సు వర్ఛస్సు వీడకుండ
అవని నిస్సారముస్సూరుమనకయుండ
అగ్నికి ఉషస్సు నెహవిస్సుహారతిచ్చి
ఉత్సవము చేసిరుత్సాహమొప్పధరణి.
హర్షా! వర్షముపడిపలు
వర్షములర్హము రక్షణయని రాజర్షుల్
ఘర్షణపడగా క్షణములో
కర్షక హర్షము నకు నొక వర్షము కురిసెన్
గొయ్యిని తియ్యకు, నుయ్యిని
ముయ్యకు, దయ్యము కలదని కుయ్యకుమయ్యా!
అయ్యనుయమ్మను నొయ్యకు
సెయ్యకు కయ్యము, గురువుతొసైయ్యనకెపుడున్.