Thursday, October 30, 2008

ఊ

ఊహా, ఊర్మిళ వేణువు ఊదుచు
ఊరు దాటి వెళ్ళీ ఊపిరి ఆడక
ఊటబావిలో ఊరిన నీటిని త్రాగీ
ఊడల మర్రికి చేరీ ఊయల ఊపుగ
ఊగుతు, ఊగుతు రైలును చూసీ
ఊటుకూరు అత్త వచ్చునని ఊహతొ
ఊపుగ ఉరుకుతు ఊరికి చేరిరి

2 comments:

రాధిక said...

అక్షరాలతో అలవోకగా ఆటలాడుకుంటూ అందరినీ ఆనందిపచేస్తున్నందుకు అభినందనలు. :)

venkatacharyulu said...

నెనర్లు