Friday, November 7, 2008

గ

ఉంగరము పోయె గంగది
బంగారుదనీ వెదుకుతు గాబర పడగా
రంగకు దొరుకగ గబగబ
ఉంగరమివ్వగ బదులుగ బొంగరమిచ్చెన్.

చెంగావి చీర హంగులు
బంగారు చెంగులు జిలుగు రంగుల పొంగున్
ఉంగరములుంగిరగిరల్
లంగాలు నెవరికి వారె భజరంగభళీ.

1 comment:

Unknown said...

ఉంగరమివ్వ"క" బదులుగ - అని ఉండాలేమో