పై పద్యాన్ని వ్రాసిన ఆచార్య వర్యా! నమస్తే. పద్యం వ్రాసే మీ ప్రయత్నం చాలా బాగుంది. మీకు నా అభినందనలు. ఈ పద్య రచన ఇంకా అద్భుతంగా దోష రహితంగా వుండాలని మీరూ తప్పక భావిస్తారు కాబట్టి నా సూచనను మన్నించ గలరు. కందపద్యంలో ప్రాస నియమం వుంటుంది. ప్రాసాక్షరమైన 2 వ అక్షరానికి ముందుండే అక్షరం గురువయితే 4 పాదాలలోనూ గురువే రావాలి. లఘువయితే లఘువే రావాలి. మీరు వ్రాసిన పద్యంలో 4 వ పాదంలో కూడా గురువు వస్తే లక్షణ యుక్తంగా అద్భుతంగా వుంటుంది. నా ఆంధ్రామృతం బ్లాగులో అక్టోబరు మాసంలో యీ యతి ప్రాసలను గూర్చి నేను వ్రాసినది మీకు ఉపయుక్తమవుతుందేమో చూడండి. నమస్తే.
శ్రీయుత రామకృష్ణారావు గారికి, నమస్కారములు. మీరు చక్కని సూచన చేశారు.ఇక పై వ్రాయబోవు నపుడు తమ సూచనను తప్పక పాటిస్తాను. అందుకే వీటికి అనుప్రాసగేయాలు అని పేరు పెట్టాను.కందపద్యంలోని అందాలను కొన్నింటిని విద్యార్ధులకు పరిచయంచేస్తూ,సంబంధిత అక్షరముపై వీలైనన్నిపదాలను చూపించుట జరిగినది. మీరు ఆంధ్రమృతం బ్లాగులో వ్రాసినవిషయాలు బాగున్నాయి. సదామీఆశీస్సులను కోరుచున్నాను.నమస్తే.
2 comments:
పై పద్యాన్ని వ్రాసిన ఆచార్య వర్యా! నమస్తే.
పద్యం వ్రాసే మీ ప్రయత్నం చాలా బాగుంది. మీకు నా అభినందనలు. ఈ పద్య రచన ఇంకా అద్భుతంగా దోష రహితంగా వుండాలని మీరూ తప్పక భావిస్తారు కాబట్టి నా సూచనను మన్నించ గలరు.
కందపద్యంలో ప్రాస నియమం వుంటుంది. ప్రాసాక్షరమైన 2 వ అక్షరానికి ముందుండే అక్షరం గురువయితే 4 పాదాలలోనూ గురువే రావాలి. లఘువయితే లఘువే రావాలి. మీరు వ్రాసిన పద్యంలో 4 వ పాదంలో కూడా గురువు వస్తే లక్షణ యుక్తంగా అద్భుతంగా వుంటుంది.
నా ఆంధ్రామృతం బ్లాగులో అక్టోబరు మాసంలో యీ యతి ప్రాసలను గూర్చి నేను వ్రాసినది మీకు ఉపయుక్తమవుతుందేమో చూడండి. నమస్తే.
శ్రీయుత రామకృష్ణారావు గారికి,
నమస్కారములు. మీరు చక్కని సూచన చేశారు.ఇక పై వ్రాయబోవు నపుడు తమ సూచనను తప్పక పాటిస్తాను.
అందుకే వీటికి అనుప్రాసగేయాలు అని పేరు పెట్టాను.కందపద్యంలోని అందాలను కొన్నింటిని విద్యార్ధులకు పరిచయంచేస్తూ,సంబంధిత అక్షరముపై వీలైనన్నిపదాలను చూపించుట జరిగినది. మీరు ఆంధ్రమృతం బ్లాగులో వ్రాసినవిషయాలు బాగున్నాయి. సదామీఆశీస్సులను కోరుచున్నాను.నమస్తే.
Post a Comment